ISKCON Warangal Jagannath Rathyatra
అకేరు న్యూస్ వరంగల్ : ఓరుగల్లు మహానగరంలో జులై 20వ తేదీన జగన్నాధుడి రథయాత్ర అత్యంత వైభవపెతంగా, భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక భావన, ఉట్టిపడేలా కీర్తనలు, భజనలు, నృత్యల నడుమ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ టెంపుల్ వరంగల్ నిర్వాహకులు మురళి వదన కృష్ణ దాస్ ప్రభు తెలిపారు.
ఈ రథయాత్రలో వరంగల్ ట్రై సిటీ ప్రజలు, యువతి, యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి కృపాకు, పాత్రులు అయ్యి విజయవంతం చేయగలరని కోరారు. ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు లడ్డు ప్రసాదాలను అందించనున్నట్లు, అదే విధంగా రాత్రి వెంకటేశ్వర గార్డెన్ లో జరిగే ముగింపు కార్యక్రమంలో భక్తి ఉపన్యాసాలతో, పాటు భోజన వితరణ కూడా ఉంటుందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా వరంగల్ మహానగరంలో ఈ జగన్నాథుడి రథయాత్ర ఎంతో ఉత్సాహంగా సాగుతుందని అన్నారు.
జగన్నాథుడి రథయాత్ర తో పాటు ఇస్కాన్ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఏకాదశి, తదితర పర్వదినాలు అత్యంత వైభఓపెతంగా నిర్వహించడం జరుగుతుందని మురళీవదన కృష్ణ దాస్ ప్రభు మీడియా సమావేశం తెలిపారు..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
