Station Ghanpur Bandh Protest
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులుని శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుత ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థుల మీద అమానవీయంగా దాడి చేసిన పోలీస్ మరియు ఆర్ ఎస్ ఎస్ గుండాల దాడిని నిరసిస్తూ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్ యుఐ, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలు బందులో పాల్గొన్నాయి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ యునుస్, ఎన్ఎస్ యుఐ నాయకుడు జానీ,
పస్తం పృథ్వి రాజ్, బానోత్ తిరుపతి, బుస్సా రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
