Mulugu SP Sudheer Ramnath Kekan Tadvai Police Station Inspection
ఆకేరు న్యూస్ ములుగు:
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ శనివారం ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. మండలంలో లో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
మొదట పోలీసుల ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ చుట్టూ కలియ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత ను పరిశీలించారు. రోడ్డు ప్రమాద కేసులలో ఉన్న వాహనాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రిసెప్షన్ అధికారి తో మాట్లాడుతూ ఫిర్యాదారులతో మర్యాదగా వ్యవహరించాలని దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులలో పురోగతిని సమీక్షించారు. ఎప్పటికప్పుడు కేసులలోని దర్యాప్తును వినవెంటనే ఆన్లైన్ లో పొందుపరచాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించారు. కేస్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. రౌడీ సీటర్ల పైన తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని అధికారులను సిబ్బందికి ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెంపొందించడం ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో ములుగు డిఎస్పి రవీందర్, పస్ర సీఐ దయాకర్ పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
