Chilpur Tholi Ekadashi Celebrations
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయంలో ‘తొలి ఏకాదశి’ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా వివిధ రకాల ఫల, పుష్పాలతో ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడిగా, దివ్యమైన ఆభరణాలు ధరించి, లక్ష్మీ సమేతుడై ఆనందంగా కొలువై ఉంటాడు. ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ భక్తులకు అభయం ఇస్తూ ఉంటాడు, స్వామి వారి వార కళ్యాణము వేదమంత్రోచరణలతో అర్చకులు వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల, పట్టణాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు గణగోని రమేష్, దారం రాజన్ బాబు, గొల్లపల్లి వాసు, కండూరి రంగరాజు, గోలి రాజశేఖర్, వేముల వెంకటేశ్వర్లు, రత్నాకర్ రెడ్డి, భుక్య శీను పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమం ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి, పుల్యల నారాయణరెడ్డి, అరుణ రమేష్, సూర్యనారాయణ ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆదిత్య ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు యల్లంకి ప్రసాద్-జ్యోతి, సాయి శరణ్య, దిలీప్, నవ్య సాయి అన్నదాన వితరణ చేశారు.
