Mahabubabad ICU Ambulance Launch
* ప్రభుత్వ ఆసుపత్రికి అత్యాధునిక ఐసీయూ అంబులెన్స్
– జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్
అకేరు న్యూస్ మహబూబాబాద్ :మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రూ.80 లక్షల వ్యయంతో అత్యాధునిక ఐసీయూ అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. ఈసీఐఎల్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన ఈ అంబులెన్స్‌ను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్, ఈసీఐఎల్ ప్రతినిధి ప్రతీక్ కుమార్ చక్రవర్తి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన ఈ ఐసీయూ అంబులెన్స్ అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వంతో పాటు సంస్థల సామాజిక బాధ్యత నిధులు కూడా ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ఈసీఐఎల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
