CPM leaders said Dharmendra Pradhan's resignation
* ధర్మేంద్ర రాజీనామా విద్యార్థుల విజయమే
– సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు సాగించిన ఉద్యమానికి దక్కిన విజయమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు అన్నారు. ఆదివారం స్టేషన్ ఘనపూర్ సిపిఎం మండల కమిటీ సమావేశం కత్తుల రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై రాపర్తి రాజు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అహంకార ధోరణితో వ్యవహరించే ప్రభుత్వాలు చివరికి ప్రజా ఉద్యమాల ముందు తలవంచక తప్పదని అన్నారు.
విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే చర్యలపై దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనల ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగిందన్నారు. ఇది ప్రజా ఉద్యమాలకు లభించిన విజయమని పేర్కొన్నారు.
ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ తన మతతత్వ, విభజన రాజకీయాలను విడనాడి, ప్రజల సంక్షేమం, నాణ్యమైన విద్య, ఉపాధి కల్పన వంటి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ మండల కమిటీ సభ్యులు కుర్ర ఉప్పలయ్య,తోడెంగల ఐలయ్య, మంద మహేందర్,చిలుముల్ల భాస్కర్, పోలాసు పరమేష్, వంగపండ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
