Musi Demolitions Protest
* మూసీపై పెద్ద కుట్ర: శ్రీనివాస్
* కూల్చివేతలపై ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ముందస్తు హెచ్చరికలు లేకుండా మూసీ నదిలోకి నీటిని విడుదల చేసి ప్రజలను భయాందోళనలకు గురిచేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని సీనియర్ సంపాదకులు డాక్టర్ కె. శ్రీనివాస్ ఆరోపించారు. మూసీ కూల్చివేతలు, వాణిజ్య కాంక్రీటీకరణ, సామూహిక నిర్వాసితాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, డాక్టర్ కె. శ్రీనివాస్ హాజరై మద్దతు తెలిపారు.
* కూల్చివేతలు ఆపాలి
మూసీ ప్రాజెక్ట్ పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సహజ నదీ వ్యవస్థ పునరుద్ధరణకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
* ప్రభుత్వంపై సుధీర్‌రెడ్డి ఫైర్
గత ప్రభుత్వం ఎలాంటి కూల్చివేతలు లేకుండానే మూసీ శుద్ధీకరణ చేపట్టిందని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేసి దానినే మూసీ శుద్ధీకరణగా చెబుతోందని విమర్శించారు. కూల్చివేతలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
* ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలి
మూసీ పరివాహక ప్రాంతానికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని, డీపీఆర్‌ను ప్రాంతీయ భాషల్లో ప్రచురించి ప్రజలతో సంప్రదింపులు జరపాలని వక్తలు డిమాండ్ చేశారు. మూసీ పునరుద్ధరణకు గతంలో ఖర్చు చేసిన నిధులపై ఆడిట్ నిర్వహించాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
