kamalapur BJP leaders
* తహశీల్దార్‌కు బీజేపీ నేతల వినతిపత్రం
ఆకేరు న్యూస్, కమలాపూర్: 22ఎ నిషేధిత భూముల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు గురువారం కమలాపూర్ తహశీల్దార్ సురేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ.. 22ఎ జాబితాలో చేర్చిన భూముల వివరాలను గ్రామపంచాయతీల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ, శిఖం, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్ భూముల వివరాలను సర్వే నంబర్లతో సహా బహిర్గతం చేయాలని కోరారు. తప్పుగా 22ఎ జాబితాలో చేరిన ప్రైవేట్ భూములను తొలగించి, భూ యజమానులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
