Collector Chahat Bajpai, Matti Ganesh Idols
* చైర్పర్సన్ గుండు సుధారాణి
* కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
ఆకేరు న్యూస్, హన్మకొండ : వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణేశ్ విగ్రహాలనే ప్రతిష్ఠించాలని KUDA చైర్పర్సన్ గుండు సుధారాణి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం KUDA కార్యాలయంలో మట్టి గణేశ్ విగ్రహాలను అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు.
PoP, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల జలవనరులు కలుషితమవుతున్నాయని సుధారాణి పేర్కొన్నారు. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చెరువు మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని కలెక్టర్ సూచించారు. విగ్రహాల ఎత్తుపై పోటీ పడకుండా తక్కువ ఎత్తు ఉన్న మట్టి విగ్రహాలతో నవరాత్రులను ఆధ్యాత్మికంగా జరుపుకోవాలని కోరారు.

Matti Ganesh Idols

Please tell us what is wrong. Your report will be sent to the website team.
