Thota Sathyam MKS Appointment
Published:
Updated: 27 Jul 2026 • 07:09 PM
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి శివుని పల్లికి చెందిన తోట సత్యం మున్నూరు కాపు సంఘం (ఎంకెఎస్) జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోగుల సారంగపాణి, జిల్లా అధ్యక్షుడు నల్లగొండ మహేందర్ లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తోట సత్యం మాట్లాడుతూ జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇచ్చిన ఈ అవకాశంతో జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తోట సత్యంను స్థానికులు పలువురు అభినందించారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
