MLA Yashaswini Reddy Development Works
* రూ. 37 లక్షలకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆకేరు న్యూస్, తొర్రూర్:
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. మండల కేంద్రం పెద్దవంగర లో పలు అభివృద్ధి పనులకు ఆమె శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా రూ. 27 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి (CC) రోడ్డు పనులకు, రూ. 10 లక్షల వ్యయంతో చేపడుతున్న మహిళా సమైక్య భవన నిర్మాణ పనులకు మరియు ఎంపీపీఎస్ (MPPS) ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ (పహారీగోడ) నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేసి, శంకుస్థాపన చేశారు.
* ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
”గ్రామీణ ప్రాంతాల స్వరూపాన్ని మార్చేందుకు, ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రూ. 27 లక్షలతో చేపడుతున్న సిసి రోడ్ల నిర్మాణంతో స్థానిక ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. అలాగే మహిళల ఆత్మగౌరవానికి, వారి ఆర్థిక బలానికి చిహ్నంగా నిలిచే మహిళా సమైక్య భవనాన్ని రూ. 10 లక్షలతో నిర్మిస్తున్నాం.”
పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం గురించి మాట్లాడుతూ, “మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలలకు సరైన రక్షణ, సౌకర్యాలు కల్పించడం మన బాధ్యత. అందుకే ఎంపీపీఎస్ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపడుతున్నాం. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, మహిళా సమైక్య సభ్యులు మరియు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
