Soil Testing Crop Cultivation
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ప్రతి రైతు తమ వ్యవసాయ భూమిలో ఇట్టి పరీక్షలు చేయించిన తర్వాతే పంటల సాగును ఎంపిక చేసుకోవాలని టి ఆర్ వి కే జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రమ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండలో టీజీ మోడల్ స్కూల్ విద్యార్థులకు మట్టి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ భూముల సారాన్ని పరిరక్షించడం, శాస్త్రీయ పద్ధతిలో పంటల సాగును ప్రోత్సహించడం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మట్టి పరీక్షల ద్వారా భూసార స్థితిని తెలుసుకొని, పంటలకు అవసరమైన ఎరువులను సమతుల్యంగా వినియోగించడం దిగుబడులు పెరగడంతో పాటు సాగు ఖర్చులు తగ్గుతాయని వివరించారు. మండల వ్యవసాయ అధికారి (MAO) ఎస్.కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో TRVK జిల్లా కోఆర్డినేటర్ డా.రమ్య, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ప్రతిభ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు క్షేత్రస్థాయిలో మట్టి నమూనాల సేకరణపై ప్రాయోగిక శిక్షణ అందించి, వారు స్వయంగా మట్టి నమూనాలను సేకరించేలా మార్గనిర్దేశం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
