Palakurthy MLA Yashaswini Reddy Review on BLAs performance
* ఓటర్ల జాబితా తప్పుల సవరణ చేయాలి
* ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్, పాలకుర్తి : బూత్ లెవల్ ఏజెంట్లే పార్టీకి – ప్రజలకు దిక్సూచి లాంటి వారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం రాయపర్తి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA)ల పనితీరుపై ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,. క్షేత్రస్థాయిలో బిఎల్ఏలు సమర్థవంతంగా పనిచేసి, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బిఎల్ఏలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పుల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి వ్యక్తికి కూడా అందేలా క్షేత్రస్థాయిలో సహాయసహకారాలు అందించాలన్నారు.కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండలానికి చెందిన ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
