పెరుమాండ్ల రామకృష్ణ
* నిందితులను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలి
* డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
Dr Perumandla Ramakrishna| ఆకేరు న్యూస్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం అల్మాస్గూడలో క్రైస్తవ మహిళలపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో బీజేపీ కార్యకర్తలు మహిళలపై దాడికి పాల్పడి, ప్రాణహాని బెదిరింపులు చేయడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలపై దాడులు చేయడం, వారి మత స్వేచ్ఛకు భంగం కలిగించడం, భయభ్రాంతులకు గురిచేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి, విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలు, వర్గాల ప్రజలకు సమాన గౌరవం కల్పిస్తూ సామాజిక న్యాయం, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని రామకృష్ణ తెలిపారు. ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల హక్కులు, రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
కొంతమంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి ఘటనలకు పాల్పడి రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు.
మహిళల గౌరవం, మత స్వేచ్ఛ, దళితుల హక్కులు, పేద ప్రజల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పునరుద్ఘాటించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

