శ్రీలీల
* రజనీకాంత్ సినిమాలో కీలక పాత్ర..
* అనిరుధ్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్న పరిచయ వీడియో
ఆకేరు న్యూస్, సినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ధర్మన్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్గా నటిస్తున్న శ్రీలీలను చిత్రబృందం పరిచయం చేసింది. ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ఈ పరిచయ వీడియోలో శ్రీలీల సరికొత్త లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “She’s the spark and she’s the pataka” అనే క్యాప్షన్‌తో మేకర్స్ ఆమె పాత్రపై ఆసక్తిని పెంచారు. దీంతో సినిమాలో శ్రీలీల పాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో రజనీకాంత్ ‘ది డెడ్లీ డాక్టర్’ అనే మిస్టీరియస్ డాక్టర్ పాత్రలో కనిపించి సినిమాపై అంచనాలు పెంచారు. ఈ చిత్రంలో నయనతార కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.
శ్రీలీల గ్లింప్స్ విడుదలతో ‘ధర్మన్’ ప్రమోషన్స్‌లో మరింత సందడి నెలకొంది. రజనీకాంత్, శ్రీలీల, నయనతార వంటి ప్రముఖ నటీనటులు ఒకే సినిమాలో కనిపించనుండటంతో ఈ ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

