Ramayana Trailer Released
* దీపావళికి పార్ట్-1 విడుదల..
ఆకేరు న్యూస్ , డెస్క్: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. 4 నిమిషాల 9 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. భారీ విజువల్స్, గ్రాండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వరల్డ్ క్లాస్ VFXతో ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది.
* ట్రైలర్లో ఏముంది..?
శ్రీరాముడి బాల్యం, విశ్వామిత్రుడితో ప్రయాణం, సీతా స్వయంవరం, వనవాసం, శూర్పణఖ ఘట్టం, రావణుడి ఎంట్రీ వరకు ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. యష్ రావణుడిగా కనిపించిన కొద్ది సన్నివేశాలే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఒకప్పటి ‘రామానంద్ సాగర్ రామాయణం’లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ఇప్పుడు దశరథుడి పాత్రలో కనిపించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* ₹4000 కోట్ల భారీ ప్రాజెక్ట్
దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా సుమారు ₹4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.
‘రామాయణ పార్ట్-1’ ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
* హనుమంతుడు ఎక్కడ..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..
ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం హనుమంతుడి పాత్ర. సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నప్పటికీ ట్రైలర్లో ఆయనను చూపించలేదు. రెండో భాగం కోసం ఆ పాత్రను సస్పెన్స్‌లో ఉంచినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. ‘రామాయణ పార్ట్-1’ ఈ ఏడాది దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
