Warangal SIR Voter Statistics
* ఏ నియోజకవర్గంలో ఎంతమంది తెలుసా…
ఆకేరు న్యూస్, వరంగల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సాంద్రత ఓటర్ల జాబితా సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముమ్మరంగా సాగింది. పోలింగ్ కేంద్రాల వారీగా బిఎల్వో (BLO)లు నిర్వహించిన ఇ ఇంటింటి సర్వే ఆధారంగా ఓటర్ల నమోదు ప్రక్రియను ఎన్నికల అధికారులు నవీకరించారు.
తాజాగా గురువారం ఉదయం 6:00 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నమోదైన ఓటర్ల ఓవరాల్ గణాంకాలు విడుదలయ్యాయి.
నియోజకవర్గాల వారీగా నమోదైన SIR ఓటర్ల వివరాలు..
వరంగల్ పశ్చిమ – మొత్తం 2,86,335 ఓటర్లలో 1,96,742 మంది నమోదు.
వరంగల్ తూర్పు – మొత్తం 2,60,437 ఓటర్లలో 2,07,064 మంది నమోదు.
నర్సంపేట – మొత్తం 2,40,244 ఓటర్లలో 2,21,732 మంది నమోదు.
వర్ధన్నపేట – మొత్తం 2,76,272 ఓటర్లలో 2,45,732 మంది నమోదు.
పరకాల -మొత్తం 2,22,679 ఓటర్లలో 2,03,579 మంది నమోదు.
జనగామ -మొత్తం 2,49,427 ఓటర్లలో 2,18,968 మంది నమోదు.
స్టేషన్ ఘన్పూర్ – మొత్తం 2,56,806 ఓటర్లలో 2,39,042 మంది నమోదు.
పాలకుర్తి – మొత్తం 2,61,241 ఓటర్లలో 2,41,547 మంది నమోదు.
డోర్నకల్ – మొత్తం 2,24,165 ఓటర్లలో 2,04,548 మంది నమోదు.
మహబూబాబాద్ – మొత్తం 2,60,770 ఓటర్లలో 2,30,794 మంది నమోదు.
భూపాలపల్లి – మొత్తం 2,77,882 ఓటర్లలో 2,39,431 మంది నమోదు.
ములుగు – మొత్తం 2,36,970 ఓటర్లలో 2,09,253 మంది నమోదు.
* ముఖ్యాంశాలు & విశ్లేషణ..
వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 2,45,732 మంది SIR ఓటర్లు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో పాలకుర్తి (2,41,547), భూపాలపల్లి (2,39,431), స్టేషన్ ఘన్పూర్ (2,39,042) నిలిచాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,86,335 ఓటర్లకు గానూ 1,96,742 మంది నమోదయ్యారు. పట్టణ ప్రాంతాల్లో వలసలు మరియు తాళం వేసిన ఇళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నమోదు శాతంలో వ్యత్యాసం కనిపిస్తోంది.
* గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతం..
నర్సంపేట, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ వంటి నియోజకవర్గాల్లో నమోదు ప్రక్రియ అత్యధిక శాతంతో విజయవంతంగా కొనసాగింది.
ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు లేదా వివరాల సరిచూపు కోసం పౌరులు Voters Service Portal (voters.eci.gov.in) లేదా Voter Helpline App ద్వారా సులభంగా ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
