Godavari Flood at Kaleshwaram
Published:
Updated: 31 Jul 2026 • 10:59 AM
ఆకేరు న్యూస్, కాళేశ్వరం:
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చాయి. త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం 11 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. నీటిమట్టం 12.210 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌కు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 5,66,000 క్యూసెక్కులుగా నమోదైంది. అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంత ప్రజలను హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
జిల్లపెళ్లి దీపిక, MA ( Journalism )
గత ఐదు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
