CM Revanth Reddy
CM Revanth Reddy: ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు సంబంధించిన భూములపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్‌కు తక్షణమే నోటీసులు ఇచ్చి, భూములపై విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. 30 రోజుల్లో విచారణ నివేదిక అందించాలని ఆదేశించారు.
ఫాంహౌస్ భూములపై విచారణ
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ ఆధీనంలో సుమారు 700 ఎకరాల భూమి ఉందని రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఫాంహౌస్‌కు సంబంధించిన భూముల వివరాలను పూర్తిగా తేల్చాలని కలెక్టర్‌ను ఆదేశించారు. విచారణలో అక్రమంగా ఉన్నట్లు తేలిన భూములను 30 రోజుల్లో స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. సంబంధిత అధికారుల నుంచి విచారణలో నిర్లక్ష్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్ ఫాంహౌస్ భూముల విషయంలో ఎస్సీలను యజమానులుగా చేస్తామని సీఎం ప్రకటించారు. ఏ భూమిని శుద్ధి చేస్తారో, అదే భూమికి ఎస్సీలను యజమానులుగా చేస్తామని తెలిపారు.
కేటీఆర్, హరీశ్‌రావుపై ఆరోపణలు
సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించిన భూముల్లోనే కేటీఆర్ ఫాంహౌస్ ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ భూములు కేటీఆర్ బంధువుల పేర్లకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు.
అలాగే సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో హరీశ్‌రావు ఫాంహౌస్‌కు రోడ్లు వేయించినట్లు సీఎం ఆరోపించారు. ఇరిగేషన్ కోసం తీసుకున్న భూమిలోనే హరీశ్‌రావు ఫాంహౌస్ ఉందని అన్నారు. హైదరాబాద్ బాలానగర్‌లో 120 ఎకరాలను హరీశ్‌రావు కుటుంబ సభ్యులు కొల్లగొట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు సైతం భయపడుతున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
కల్వకుంట్ల కుటుంబం భూముల వివరాలు
తెలంగాణ ఉద్యమం, ధరణిని అడ్డుపెట్టుకుని భూముల విషయంలో దోపిడీ జరిగిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీలో వెల్లడించారు.
కల్వకుంట్ల కుటుంబం మొత్తం – 440 ఎకరాలు
కేసీఆర్ దంపతుల పేర్లపై – 67 ఎకరాలు
కేటీఆర్ కుటుంబంలోని నలుగురి పేర్లపై – 123 ఎకరాలు
కేటీఆర్ – 49.5 ఎకరాలు
శైలిమ – 17.5 ఎకరాలు
అలేఖ్య – 9.38 ఎకరాలు
హిమాన్షు – 46.3 ఎకరాలు
హరీశ్‌రావు కుటుంబం – 30 ఎకరాలు
కవిత కుటుంబం – 37 ఎకరాలు
సంతోష్‌రావు కుటుంబం – 79 ఎకరాలు
నవీన్‌రావు – 52 ఎకరాలు
కొండల్రావు – 48 ఎకరాలు
ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములను గుర్తించి చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
