NTPC Recruitment 2026
* దరఖాస్తు గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు
ఆకేరు న్యూస్, డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ NTPC Green Energy Limited (NGEL)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. మొత్తం 114 రెగ్యులర్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు గడువును సంస్థ పొడిగించింది.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియను 2026 ఆగస్టు 31 సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఖాళీల వివరాలు..(డిప్యూటీ జనరల్ మేనేజర్)
ఈ నోటిఫికేషన్ ద్వారా 100(అసిస్టెంట్ ఇంజనీర్)Assistant Engineer-RE (E0 Grade) పోస్టులు, 14 (డిప్యూటీ జనరల్ మేనేజర్)Deputy General Manager-RE (E6 Grade) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న NGEL కార్పొరేట్ కార్యాలయాలు, ప్రాజెక్టులు, జాయింట్ వెంచర్లు, అనుబంధ సంస్థల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు.
* విద్యార్హత..
అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో రెగ్యులర్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అదనంగా పవర్ సెక్టార్లో కనీసం 10 సంవత్సరాల అనుభవం, అందులో కనీసం 6 సంవత్సరాలు 50MW లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సోలార్ లేదా విండ్ ప్రాజెక్టుల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లేదా అసెట్ మేనేజ్మెంట్ అనుభవం ఉండాలి.
డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ లేదా కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు కనీసం 60 శాతం మార్కులు అవసరం. SC, ST, PwBD అభ్యర్థులకు పాస్ మార్కులు సరిపోతాయి. అలాగే పవర్ సెక్టార్లో 12 సంవత్సరాల అనుభవం, అందులో 10 సంవత్సరాలు Renewable Energy ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి విషయానికి వస్తే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు గరిష్టంగా 40 సంవత్సరాలు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 44 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.
వేతనం కూడా ఆకర్షణీయంగానే ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నెలకు ₹30,000 నుంచి ₹1,20,000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు ₹90,000 నుంచి ₹2,40,000 వరకు పే స్కేల్ ఉంటుంది. బేసిక్ పేతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు కూడా కంపెనీ నిబంధనల ప్రకారం అందిస్తారు.
* దరఖాస్తు రుసుము
General / OBC / EWS – ₹500
SC / ST / PwBD / Ex-Servicemen / మహిళా అభ్యర్థులు – ఫీజు లేదు
* ఎంపిక విధానం..
ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల దరఖాస్తుల స్క్రీనింగ్ అనంతరం అవసరాన్ని బట్టి రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ లేదా వీటి కలయిక ద్వారా తుది ఎంపిక చేపడతారు.
* ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు NGEL అధికారిక వెబ్సైట్ https://ngel.in/ngel-home లోని Careers విభాగం ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి 2026 ఆగస్టు 31 సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
* అధికారిక ప్రకటన – https://ngel.in/public/career/1/f61734f728/f61734f728.pdf
* ఇక్కడ అప్లై చేయండి – https://careers.ngel.in/
Please tell us what is wrong. Your report will be sent to the website team.
