Compound Wall Collapse Hanumakonda
Published:
Updated: 06 Aug 2026 • 11:43 AM
ఆకేరు న్యూస్ , వర్ధన్నపేట : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటి వెనుక పునాది మరమ్మతుల పనులు జరుగుతుండగా, ప్రమాదవశాత్తు ప్రహరీ గోడ కూలి వృద్ధురాలు మృతి చెందింది.
గ్రామానికి చెందిన గిన్నెలు కడుగుతున్న లక్ష్మీకాంతమ్మ (70)పై ఒక్కసారిగా గోడ కూలిపడటంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
