President Bhavan eUPAHAAR Auction
* సామాజిక కార్యక్రమాలకు నిధులు
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
రాష్ట్రపతికి వివిధ సందర్భాల్లో అందిన బహుమతుల్లో ఎంపిక చేసిన 300 ప్రత్యేక వస్తువులను ఈ-ఉపహార్ (E-Upahaar) ద్వారా ఆన్లైన్ బహుమతుల వేలం పోర్టల్ లో విక్రయించనున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ఈ వేలం ఆగస్టు 5, 2026 నుంచి సెప్టెంబర్ 5, 2026 వరకు కొనసాగుతుంది.
ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. ఆసక్తి గల దేశీయ పౌరులు అధికారిక వెబ్సైట్ http://upahaar.rashtrapatibhavan.gov.in వెబ్సైట్లో తమకు నచ్చిన వస్తువులపై బిడ్డింగ్ చేయవచ్చు.
వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వేలం రాష్ట్రపతి భవన్లోని ప్రత్యేక బహుమతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సామాజిక సేవకు నిధులు సమకూర్చాలని లక్ష్యంగా జరుగుతుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
