Punjab National Bank Recruitment
* ఆగస్టు 9తో ముగియనున్న దరఖాస్తులు
ఆకేరు న్యూస్, డెస్క్: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) గుడ్‌న్యూస్ చెప్పింది. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMGS-I) లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 9, 2026తో ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* అర్హతలు, వయోపరిమితి
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంక్‌లో క్లరికల్ లేదా ఆఫీసర్ కేడర్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరి. 2026 జూలై 1 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు వయోసడలింపు వర్తిస్తుంది.
* ఎంపిక విధానం, జీతం
అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి రూ.48,480 నుంచి రూ.85,920 వరకు పే స్కేల్‌తో పాటు బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
* రాష్ట్రాల వారీగా ఖాళీలు
| రాష్ట్రం | స్థానిక భాష | మొత్తం ఖాళీలు |
|---|---|---|
| అస్సాం | అస్సామీ / బోడో | 85 |
| పశ్చిమ బెంగాల్ | బెంగాలీ | 80 |
| కర్ణాటక | కన్నడ | 78 |
| గుజరాత్ | గుజరాతీ | 77 |
| మహారాష్ట్ర | మరాఠీ | 67 |
| తమిళనాడు | తమిళం | 51 |
| తెలంగాణ | తెలుగు | 41 |
| త్రిపుర | బెంగాలీ / కోక్బోరోక్ | 18 |
| జమ్మూ & కాశ్మీర్ | ఉర్దూ / డోగ్రీ / కాశ్మీరీ | 9 |
| మేఘాలయ | గారో / ఖాసి | 8 |
| మణిపూర్ | మణిపురి / మైతేయి | 6 |
| మిజోరాం | మిజో | 5 |
| నాగాలాండ్ | ఇంగ్లీష్ | 5 |
| సిక్కిం | నేపాలీ / సిక్కిమీస్ | 5 |
| ఆంధ్రప్రదేశ్ | తెలుగు | 4 |
| అరుణాచల్ ప్రదేశ్ | ఇంగ్లీష్ | 4 |
| లడఖ్ | ఉర్దూ / పుర్గి / భోటి | 2 |
* దరఖాస్తు రుసుము
| వర్గం | రుసుము |
|---|---|
| SC / ST / PwBD | రూ.59 (రూ.50 + GST) |
| మిగతా అన్ని వర్గాలు | రూ.1,180 (రూ.1,000 + GST) |
* ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తుల ప్రారంభం: జూలై 20, 2026
- చివరి తేదీ: ఆగస్టు 9, 2026
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఆగస్టు 9, 2026
- అడ్మిట్ కార్డ్: పరీక్షకు 8-10 రోజుల ముందు
- ఆన్లైన్ పరీక్ష: ఆగస్టు / సెప్టెంబర్ 2026
Please tell us what is wrong. Your report will be sent to the website team.
