Chiranjeevi AP Brand Ambassador
* ఆయన వ్యక్తిగత టీం క్లారిటీ ఇదే
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి.. ఆంధ్రప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం అవుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన వ్యక్తిగత టీం తెలిపింది. వాటిని అభిమానులు, శ్రేయోభిలాషులు నమ్మవద్దని కోరింది. చిరంజీవి చరిష్మాతో పర్యాటకం, పెట్టుబడులు వచ్చేందుకు కొంతవరకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ భావనగా చర్చ నడుస్తున్నదని తెలిసింది.
* చిరు ఫుల్ బిజీ గురూ..
చిరంజీవి ఖైదీ నంబర్ 150 చిత్రంలో సినీ పరిశ్రమలో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారని వ్యక్తగత సభ్యులు తెలిపారు. పాలిటిక్స్ నుంచి ఆయన కంప్లీట్ గా బయటికి వచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం విశ్వంభర, మెగా 158 వర్కింగ్ టైటిల్.. సినిమా షూట్ల లో బిజీగా ఉన్నారని తెలిపారు. విశ్వంభర దసరాకు (అక్బోబర్ 16న ) రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.
* చిరుకు బర్త్ డే .. డబుల్ బొనాంజా
దర్శకుడు బాబీ , మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ వస్తున్న మెగా 158 (వర్కింగ్ టైటిల్) మూవీ శరవేగంగా షూట్ జరుగుతోంది.
ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే ఆరోజు టైటిల్ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ఇక శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా చేస్తారంటూ టాక్ వినిపిస్తున్నది. ఏదైనా మెగాస్టార్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా తప్పదని తెలుస్తోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
