Women Self Employment Schemes
* స్వయం ఉపాధి పథకాలపై DRDO కీలక వ్యాఖ్యలు…
ఆకేరు న్యూస్, పర్వతగిరి:
ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి (DRDO) నాగ పద్మజ పిలుపునిచ్చారు.
శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని కొంకపాక గ్రామంలో రూ. 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మిల్లెట్ యూనిట్, దాల్ మిల్లును వి-హబ్ (V-Hub) మరియు ఇక్రిశాట్ (ICRISAT) ప్రతినిధులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నాగ పద్మజ మాట్లాడుతూ.. మహిళా సాధికారత సాధించడంలో స్వయం ఉపాధి రంగాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ యూనిట్ పునరుద్ధరణకు, మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన పూర్తి సహకారాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం పర్వతగిరిలోని మదర్ థెరిస్సా మండల సమైక్య కార్యాలయాన్ని సందర్శించి, సిబ్బందితో కలిసి పలు అభివృద్ది పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వి-హబ్, ఇక్రిశాట్ ప్రతినిధులు మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (SHG) మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
