Kamakshi Bhaskarla Telugu Actresses Opportunities
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని నటి కామాక్షి భస్కర్ల అన్నారు. ‘అగధ’ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
* ప్రతిభ ఉన్న సరైన అవకాశాల్లేవు
తెలుగు అమ్మాయిలు కూడా నటనలో ప్రతిభ చూపుతున్నప్పటికీ, వారికి సరైన అవకాశాలు రావడం లేదని కామాక్షి భస్కర్ల అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో స్థానిక ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
* అగధ ఓ మంచి అనుభూతి
‘అగధ’ సినిమా తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని, ఈ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని కామాక్షి తెలిపారు. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, చిత్రబృందానికి మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. తెలుగు అమ్మాయిలకు మరిన్ని అవకాశాలు లభిస్తే తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రీ-రిలీజ్ వేడుకలో చిత్రబృందం, సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
