RC17 Script Update
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మరో సినిమా ఆర్సీ 17. ఇప్పటికే రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ఈ ఇద్దరి కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయి, కథను లాక్ చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
* పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ..
సుకుమార్ తన సినిమాల్లో కథ, పాత్రల విషయంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కోసం కూడా ఆయన విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రంగస్థలంలో చిట్టిబాబు పాత్రతో చరణ్‌ను మరో కోణంలో చూపించిన సుకుమార్.. ఈసారి అంతకుమించిన పవర్ఫుల్ క్యారెక్టర్లో చూపించనున్నారనే చర్చ సాగుతోంది. అయితే సినిమా కథ, జానర్, మిగతా నటీనటుల వివరాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
* కొత్త లుక్ లోకి చరణ్
ఈ సినిమా కోసం రామ్ చరణ్ కొత్త లుక్ లోకి మారబోతున్నారు. పాత్ర అవసరాల కోసం ఆయన ఏకంగా 15 కిలోల వరకు బరువు తగ్గనున్నట్లు సమాచారం. స్లిమ్‌గా మారడంతో పాటు పొడవాటి జుట్టుతో చరణ్ ఇప్పటివరకు కనిపించని ఒక సరికొత్త గా కనిపిస్తారని టాక్.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
