Dryland Crops for Farmers
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఎలినినొ(వర్షా బావ) ప్రభావం తో సాగునీటికి ఇబ్బంది పడుతున్న రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని గ్రామ సర్పంచ్ ఎడవల్లి లావణ్య మల్లారెడ్డి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ లో మంగళవారం వర్షాభావ పరిస్థితులు, ఆరుతడి పంటల సాగుపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేసుకుని నష్టపోకుండా చూసుకోవాలని కోరారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు ఆరు తడి పంటల సాగు, విత్తనాల లభ్యత, మార్కెటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పసుల వెంకటేశ్వర్లు వార్దు సభ్యులు, కార్యదర్షి మహెందెర్, ఏఈఒ ప్రవలిక, పుల్యల నారాయణ రెడ్డి, కొమ్మరాజుల రాజయ్య, షమ, తార, రేణుక తదితరలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
