టాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్నవర్మ ఆత్మహత్య
* ప్లాట్లో ఉరేసుకున్న స్వప్నవర్మ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్లోని కావూరిహిల్స్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన స్వప్నవర్మ (33) మూడేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. కావూరిహిల్స్ లోని తన ఫ్లాట్ లో డోర్ లాక్ చేసుకుని రెండురోజుల క్రితం ఉరేసుకున్నారు. ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఆమె ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆరు నెలలుగా సినిమాలు లేకపోవడంతో మనస్తాపంలో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
——————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
