నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదా
Published:
Updated: 06 Jul 2024 • 09:56 AM
ఆకేరు న్యూస్ డెస్క్ : నేటి నుంచి ప్రారంభం కావాల్సిన నీట్ యూజీ కౌన్సెలింగ్ (NEET UG Counselling) వాయిదా పడింది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. ఎప్పుడు జరిపేది త్వరలోనే తెలియజేస్తామన్నారు. తదుపరి ప్రకటన వచ్చేంత వరకూ నీట్ కౌన్సెలింగ్ ను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అవకతకవలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై జరుగుతున్న వివాదాలు, విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో కౌన్సెలింగ్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
————————
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
