Mulugu Gattamma Temple Road Accident
* మేడారం వెళ్తున్న సూర్యాపేట భక్తుల ఆటోను ఢీకొట్టిన బొలెరో
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు సమీపంలోని గట్టమ్మ దేవాలయం మూల మలుపు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం వనదేవతల దర్శనం కోసం సూర్యాపేట నుంచి ఆటోలో వస్తున్న భక్తులను ఒక బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి కాళ్లు, చేతులు విరిగి తీవ్ర క్షతగాత్రులయ్యారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్సుల్లో బాధితులను ములుగు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
