Mulugu Independence Day Celebrations
* జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఆకేరు న్యూస్,ములుగు:
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు, సిబ్బందికి, విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.
విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రెవెన్యూ సి.హెచ్. మహేందర్, స్థానిక సంస్థలు జి. సంపత్ రావు, ఆర్డీఓ కృష్ణవేణి, డిఆర్ఓ రవికుమార్,జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్ హుస్సేనీ, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.డి. రఫిక్, కలెక్టరేట్ ఏఓ రాజ్ కుమార్, కలెక్టరేట్ విభాగాల పర్యవేక్షకులు, కలెక్టరేట్ కాంప్లెక్స్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
