Puligilla Student Support Program
* పులిగిల్లలో విద్య వెలుగులు
* హన్మకొండ జిల్లా నడికూడ ఆగస్టు 15
ఆకేరు న్యూస్, హనుమకొండ:
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచడానికి, వారి విద్యాభ్యాసానికి చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి కొన్ని సంస్థలు. తాజాగా నడికూడా మండలం పులిగిల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇదే స్ఫూర్తిని చాటారు.
ధర్మం ఫౌండేషన్ డే సందర్భంగా ధర్మాజ్ క్రాప్ గాడ్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులను ఘనంగా పంపిణీ చేశారు. విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్య ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైనదని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, గ్రామీణ విద్యార్థులకు తమ వంతు సహకారం అందించడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడవచ్చని పేర్కొన్నారు. అందిస్తున్న చిన్న చిన్న అవకాశాలను కూడా విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, గొప్ప లక్ష్యాలను సాధించాలని సూచించారు.
తమ పాఠశాల విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేసి ప్రోత్సహించడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధర్మాజ్ క్రాప్ గాడ్ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ పుట్టా బుచ్చిబాబు, టెరిటరీ మేనేజర్ బొమ్మన బోయిన అనిల్, గ్రామ సర్పంచ్ ఇనుగల పద్మ-ఐలోని, ఉపసర్పంచ్ రాసమల్ల మల్లికార్జున్, గ్రామ కార్యదర్శి ఎం.డి. రిజ్వానా, ప్రధానోపాధ్యాయులు సంపత్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

Please tell us what is wrong. Your report will be sent to the website team.
