Konduru School Independence Day
* ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేత
ఆకేరు న్యూస్, రాయపర్తి:
కొండూరు.పి.ఎం.శ్రీ జడ్పీహెచ్ఎస్ కొండూరు ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయురాలు కొణతం పద్మలత, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు గ్రామ సర్పంచ్ రాయిని యాకన్న, ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ అబీదా బేగం, ఉపసర్పంచ్ బుషీరా బేగం, స్థానిక వార్డు సభ్యులు అతిథులుగా హాజరయ్యారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ.. పి.ఎం.శ్రీ పథకం కింద విద్యార్థులకు చదువుతో పాటు యోగా, కంప్యూటర్ విద్య, అగ్రికల్చర్, మ్యూజిక్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. క్రీడలు, పోటీ పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసించారు. గత విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీలో 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, పలువురు విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచిత ఇంటర్ విద్యను పొందుతున్నారని పాఠశాల ప్రగతిని వివరించారు.
* ఆదర్శంగా నిలిచిన దాతృత్వం
కొండూరు గ్రామానికి చెందిన దివంగత చిదురాల ఏకాంబరం జ్ఞాపకార్థం వారి పిల్లలు వెన్నెల, పావని, క్రాంతి కిరణ్‌లు గత సంవత్సరం పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన కె. గణేష్ (₹3,000), జె. శిరీష (₹2,500), బి. శైలజ (₹2,500)లకు ప్రోత్సాహకాలను అందజేశారు.
పాఠశాల మాజీ చైర్మన్ కర్ర ప్రవీణ్ రెడ్డి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ₹2,000 నగదు బహుమతి అందజేశారు.
పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు నేతుల స్వామి, తల్లిని కోల్పోయిన ఇరువురు విద్యార్థినులు గాయత్రి, సాత్వికల విద్యాభ్యాసానికి చేయూతగా ₹2,000 నగదు సాయాన్ని అందించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో , ఉపాధ్యాయులు శ్రీరామ్‌రెడ్డి, వి.వి.ఆర్. ఆచార్య, సత్యనారాయణ, రఘు శ్యాంసుందర్ నాగరాజు ఎన్ వి శ్రీదేవి అనిత రాణి స్వామి శివకృష్ణ భోజ్యా, వీరస్వామి స్వరూప,శోభ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
