Elkathurthy Road Accident
Published:
Updated: 16 Aug 2026 • 01:56 PM
ఆకేరు న్యూస్, హన్మకొండ : ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ బస్టాండ్ వద్ద సిద్దిపేట–హనుమకొండ రహదారిపై ఆటో ఢీకొని హుస్నాబాద్‌కు చెందిన మహ్మద్ సలీం భాష (65) అనే వ్యక్తి మృతి చెందాడు. నీటి కోసం రోడ్డు దాటుతుండగా దామెర వైపు వెళ్తున్న ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
———————
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
