Prabhas Spirit Movie
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా సినిమా ఎంట్రీ సీన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* స్పెషల్ డిజైన్ ..
‘స్పిరిట్’లో ప్రభాస్‌ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించనున్న విషయం ఇప్పటికే వెల్లడైంది. అయితే ఆయనను ప్రేక్షకులకు పరిచయం చేసే సన్నివేశాన్ని సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. హీరో ఎలివేషన్‌తో పాటు పాత్రలోని ఇంటెన్సిటీని ఒకేసారి చూపించేలా ఈ సీన్ ఉండనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
* గుస్ బంప్స్ వచ్చే లా ప్లాన్
ప్రభాస్ ఎంట్రీకి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారీ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్ జోడించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా థియేటర్లో ప్రభాస్ ఎంట్రీ పడే సమయంలో అభిమానులకు గూస్బంప్స్ వచ్చేలా సీన్‌ను ప్లాన్ చేస్తున్నారనే టాక్ .
* ఇది ప్రచారంలో ఉంది
సెంట్రల్ జైలులో ఈ సీక్వెన్స్ ఓపెన్ అవుతుందట. ఇక్కడ అలజడి కారణంగా భారీ టెన్షన్ .. ఒక్కసారిగా నేరస్థులు హద్దులు దాటుతుంటే .. ప్రభాస్ పాత్ర పేరు వినపడుతుందట.. ఆకస్మత్తుగా నేరస్థుల్లో గుండె భయం మొదలయ్యేలా బిల్డ్ అయ్యేలా సీన్ డిజైన్ చేశారని వినికిడి. ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
