Actress Anupama Parameswaran Dulquer Salmaan
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనకు కష్ట సమయంలో అండగా నిలిచే వ్యక్తి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు బాధగా ఉన్నప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి నటుడు దుల్కర్ సల్మాన్ అని ఆమె చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ తన వ్యక్తిగత జీవితంలోని ఎన్నో విషయాలను పంచుకున్నారు.
* ఆశ్చర్యం అనిపిస్తుంది..
తాను డౌన్‌గా ఉన్నప్పుడు దుల్కర్ నుంచి అనూహ్యంగా మెసేజ్ వస్తుందని అనుపమ తెలిపారు. ‘‘నువ్వు బాగున్నావా అని అడగాలని అనిపించింది’’ అంటూ ఆయన మెసేజ్ చేస్తుంటారని చెప్పారు. దుల్కర్ తన పరిస్థితిని ఎలా గుర్తిస్తారో చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.
దుల్కర్ ఫోన్ చేసినప్పుడు తన మనసులో ఉన్న విషయాలన్నింటినీ ఆయనతో చెప్పుకుంటానని అనుపమ తెలిపారు. తన మాటలను ఓపికగా విని, ఆ తర్వాత తనకు మద్దతుగా నిలుస్తారని చెప్పారు. అందుకే దుల్కర్ తనకు ఎంతో నమ్మకమైన, ఆప్తమైన స్నేహితుడిగా మారారని ఆమె వెల్లడించారు.
* నమ్మకమైన వ్యక్తుల్లో ఆయన కూడా
దుల్కర్‌తో పాటు తెలుగు నటుడు రామ్ పోతినేని కూడా తనకు నమ్మకమైన వ్యక్తుల్లో ఒకరని అనుపమ చెప్పారు. ప్రస్తుతం తన చుట్టూ తనను పలకరిస్తూ, తాను బాగున్నానా అని అడిగే వారు చాలామంది ఉన్నారని, అది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు.
* జోమోన్, క్యాథరిన్ ..ఓ జోమోంటే సువిశేషంగళ్
ఇక అనుపమ, దుల్కర్ సల్మాన్ గతంలో ‘జోమోంటే సువిశేషంగళ్’ సినిమాలో కలిసి నటించారు. 2017లో విడుదలైన ఈ మలయాళ చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించారు. సినిమాలో దుల్కర్ జోమోన్ పాత్రలో, అనుపమ క్యాథరిన్ పాత్రలో కనిపించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
