Bandla Ganesh Daughter Wedding
* సీఎం రేవంత్ సహా ప్రముఖుల హాజరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని బండ్ల వివాహం ఆదివారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని వివాహం జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
* సీఎంలు, రాజకీయ ప్రముఖుల సందడి
జనని వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి కూడా పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితర రాజకీయ ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు.
* సినీ తారలతో కళకళ
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో పెళ్లి వేదిక సందడిగా మారింది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, విక్టరీ వెంకటేష్, నాగార్జున, నాగచైతన్య, శోభిత దూళిపాళ, అల్లు అరవింద్, బ్రహ్మానందం, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, తమన్, సునీల్, రాజశేఖర్-జీవిత తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
* ప్రత్యేకంగా ఆహ్వానించిన బండ్ల గణేష్
కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు బండ్ల గణేష్ స్వయంగా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఇప్పటికే మహేశ్ బాబు-నమ్రత దంపతులను, చిరంజీవి-సురేఖ దంపతులను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
