Bengali Director Raja Sen
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ప్రముఖ బెంగాలీ సినీ దర్శకుడు రాజా సేన్ (71) కన్నుమూశారు. ఆదివారం కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తీవ్రం కావడంతో ఆయన పరిస్థితి మరింత దిగజారింది.
* వెన్ను భాగంలో గాయంతో ఆస్పత్రికి
కింది వెన్ను భాగంలో గాయంతో తొలుత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాజా సేన్ చేరారు. చికిత్స సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అనంతరం ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలు ఏర్పడటంతో ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తినట్లు సమాచారం.
* ‘దాము’తో దర్శకుడిగా అరంగేట్రం
రాజా సేన్ 1996లో ‘దాము’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఓ చిన్నారి, ఏనుగు మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది.
తన సినీ ప్రయాణంలో ఫీచర్ సినిమాలతో పాటు టెలివిజన్, డాక్యుమెంటరీ రంగాల్లోనూ రాజా సేన్ పనిచేశారు. ‘ఆత్మియో స్వజన్’, ‘దేశ్’, ‘దేవీపక్ష’, ‘కృష్ణకాంతేర్ విల్’, ‘లాబొరేటరీ’, ‘మాయా మృదంగా’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.
* గుర్తింపు తెచ్చిన చిత్రం ‘దేశ్’
2002లో రాజా సేన్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశ్’ చిత్రంలో జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించారు. దీంతో ఆయన సినిమాకు మరింత గుర్తింపు లభించింది. డాక్యుమెంటరీ చిత్రాలపైనా రాజా సేన్ ప్రత్యేక ఆసక్తి చూపించారు. పలువురు ప్రముఖులు, సాంస్కృతిక రంగానికి చెందిన వ్యక్తుల జీవితాలు, కళా ప్రయాణాలపై డాక్యుమెంటరీలు రూపొందించారు. ప్రముఖ రవీంద్ర సంగీత గాయని సుచిత్రా మిత్రపై కూడా ఆయన డాక్యుమెంటరీ తెరకెక్కించారు.
* ప్రముఖుల సంతాపం
రాజా సేన్ మృతి విషయం తెలియడంతో బెంగాలీ సినీ పరిశ్రమ ప్రముఖులు, సినీ రాజకీయ నటుడు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
