NHRC Telangana State Convenor
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి చాగల్ కు చెందిన చేపూరి వినోద్ కుమార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఆర్ సి) రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు జాతీయ కౌన్సిలర్ రామచంద్రప్ప చేపూరి వినోద్ కుమార్ కు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా చేపూరి వినోద్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశాన్నిచ్చిన రామచంద్రప్ప కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉమెన్ రైట్స్ మీద అవగాహన కలిగిన నాకు ఈ పదవిని అందించారని పదవికి తప్పకుండా న్యాయం చేస్తానని తెలిపారు. అందరి సహకారంతో ఉమెన్ రైట్స్ పై వచ్చే ఫిర్యాదుల పైన స్పందించి వారికి తగిన న్యాయం చేస్తానన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
