Raviteja Irumudi Movie Update
* మాస్ మహారాజా ఇరుముడి హంగామా
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఈవెంట్లో అయ్యప్ప భక్తులకు అత్యంత ప్రియమైన ‘మల్లెపూల పల్లకి’ రీ-మిక్స్డ్ వర్షన్ సాంగ్‌ను అత్యంత వైభవంగా ఆవిష్కరించారు. ఒరిజినల్ ట్రాక్‌ను కంపోజ్ చేసిన డప్పు శ్రీను వాయిస్‌తోనే, జీవీ ప్రకాష్ కుమార్ గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్, పవర్ఫుల్ డప్పు రిథమ్స్‌తో దీన్ని రీ-క్రియేట్ చేశారు. అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్‌లో రవితేజ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, సాంప్రదాయ విజువల్స్ పాటకు పక్కా మాస్ అప్పీల్‌ను తీసుకొచ్చాయి.
* హీరో రవితేజ ఏమన్నారంటే..
“ఈ సినిమా కోసం టెక్నీషియన్లు ప్రవీణ్ పూడి, సాహి సురేష్, డీఓపీ విష్ణు శర్మ తమ సొంత సినిమా అనుకుని ప్రాణం పెట్టి పనిచేశారు. జీవీ ప్రకాష్ కుమార్ మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బ్రహ్మాండమైన పాటలు ఇచ్చారు. స్వాసిక, సాయికుమార్ గారితో పాటు బేబీ నక్షత్ర ఎక్స్ట్రార్డినరీగా నటించారు. ప్రియా భవానీ శంకర్ ఇందులో ‘కావేరి’ అనే పాత్రలో కేవలం కొన్ని సీన్లలోనే కనిపిస్తుంది కానీ మీ హృదయాలను తాకుతుంది. మా నిర్మాతలు రవి, నవీన్‌తో నాకు ఇది మూడో సినిమా. ఒక విషయం మాత్రం బల్లగుద్ది చెబుతున్నా.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది! ఒక డిఫరెంట్ రవితేజను థియేటర్లలో చూస్తారు.”
View this post on Instagram
* చివరి 40 నిమిషాలు ఎమోషనల్ రైడ్..
“‘మల్లెపూల పల్లకి’ పాట థియేటర్లో ఒక తాండవంలా ఉంటుంది. ఇది నా గత సినిమాల లాగా లైట్‌హార్టెడ్‌గా ఉండదు.. చాలా సీరియస్‌గా, ఇంటెన్స్ టెన్షన్‌తో కూడుకున్న ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్. సీలేరులోని రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. చివరి 40 నిమిషాలు మిమ్మల్ని తీవ్రమైన ఎమోషనల్ డ్రామాలో ముంచేస్తుంది. రవితేజ గారు, సాయికుమార్ గారు, నక్షత్ర పెర్ఫార్మెన్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక గొప్ప ఎమోషన్ తీసుకొస్తారు.”
* జీవీ ప్రకాష్ కెరీర్లోనే మైలురాయిలాంటి మ్యూజిక్..
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. రవితేజ కెరీర్లో ‘విక్రమార్కుడు’ కంటే కూడా ఇది బిగ్గెస్ట్ మెమోరబుల్ మూవీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్, సెంటిమెంట్, మాస్ మూమెంట్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆర్కెస్ట్రేషన్ అందించినట్లు తెలిపారు.
ఇక ప్రొడ్యూసర్ రవిశంకర్, ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకులు బాబీ కొల్లి, బుచ్చిబాబు సనా, రాహుల్ సాంకృత్యన్, సాయి రాజేష్, ప్రొడ్యూసర్ ఎస్.కే.ఎన్ ఈ సినిమా గ్యారెంటీగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుందని, ఆగస్టు 21న థియేటర్లలో ‘ఇరుముడి’ హిస్టరీ క్రియేట్ చేస్తుందని ఆకాంక్షించారు.
నటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు.
సాంకేతిక వర్గం: దర్శకత్వం – శివ నిర్వాణ, సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ – విష్ణు శర్మ, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, నిర్మాతలు – నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్).

Please tell us what is wrong. Your report will be sent to the website team.
