GO 97 Polytechnic Education
* జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని విద్యార్థుల ర్యాలీ
* శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి-ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ డిమాండ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
సాంకేతిక విద్యను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, పాలిటెక్నిక్ విద్య వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖలో వీలినం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ జనగామ జిల్లా కన్వీనర్ మొహమ్మద్ యునుస్ ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి దాసగాని సుమ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి వామపక్ష విద్యార్థి సంఘల ఆధ్వర్యంలో ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డిఓకి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య అనేది పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే ఒక ప్రత్యేక వ్యవస్థ అని పేర్కొన్నారు. దీనిని శక్తి శాఖలో కలపటం వలన విద్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ పరం అయితే పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో కూడిన డిప్లోమా విద్య అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య ప్రభుత్వాలు అందుబాటులో ఉంచాలి గాని పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలకు పూనుకుంటుందనీ ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 97 ను ఉప సవరించుకోవాలన్నారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యా మండలిని విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అందుకు మంత్రివర్గం ఉప సంఘం పచ్చ జెండా ఊపింది కానీ ఆ తర్వాత కొత్తగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఐటీ పరిశ్రమలు శాఖ పరిధిలో నడుస్తున్న ఈ యూనివర్సిటీని సాంకేతిక విద్యా శాఖ పరిధిలోకి తెస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆ దిశగా ముందడుగు పడలేదు తాజాగా ఐటిఐలు, ఏటీసీలు పాలిటెక్నిక్ కళాశాల!ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చేర్చాలని సర్కార్ నిర్వహించింది దీంతో ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖతో ఆటలాడుతుందని ఇలాంటి నిర్ణయాలను వెనుక తీసుకోవాలని ప్రభుత్వం! తీసుకువచ్చిన నూతన పాలసీ ద్వారా విద్యార్థులు కార్మికులుగా మారే అవకాశం ఉందని, వేలాదిమంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసి పాలిటెక్నిక్ కళాశాలలో జాయిన్ అవుతే నేడు ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్ణయాన్ని చూసి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని, లక్షలాదిమంది విద్యార్థులు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో చదువుతున్నారని ప్రభుత్వం వారికి అధిక సదుపాయాలు కల్పించి అధ్యాపకులు భర్తీ, ల్యాబ్ల ఆధునికరణ వర్క్ షాపులు నిర్వహణ హాస్టల్ అభివృద్ధి చేయాలి కానీ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం సరికాదని తక్షణమే ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలని లేని ఎడల వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఏఐఎస్ఎఫ్ జిల్లానాయకులు పస్తం పృథ్విరాజ్, బానోత్ తిరుపతి నాయక్, బుస్సా రోహిత్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శ సాయి తేజ, సన్నీ, అంజి పాలిటెక్నీక్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల ర్యాలీకి భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈ ధర్నా లో సిపిఐ మండల కార్యదర్శి తోట రమేష్ సహాయ కార్యదర్శి రహ్మతుల్లా పాల్గొన్నారు..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
