errabelli dayakar protest, SRSP Canal Water Release
* ఎస్ఆర్ఎస్పి కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని ఎర్రబెల్లి పాదయాత్ర, ధర్నా
ఆకేరు న్యూస్, రాయపర్తి :
రాష్ట్రంలో సరిపడా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి (SRSP) మైలారం రిజర్వాయర్ కాలువలకు సాగునీటిని విడుదల చేయడం లేదని నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో సోమవారం భారీ పాదయాత్ర, ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
రాయపర్తి మండల కేంద్రంలోని మైలారం ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర, తోరూరు మండలంలోని నాంచారిమడూర్ కెనాల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
పాదయాత్ర అనంతరం నాంచారిమడూర్ వద్ద ఎస్ఆర్ఎస్పి కెనాల్‌పై నిర్మించిన బ్రిడ్జిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఎండిపోతున్న పంటలను కాపాడటానికి మైలారం రిజర్వాయర్ ఎస్ ఆర్ ఎస్ పి కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రైతుల గోడును పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఈ ధర్నా కార్యక్రమంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ప్రశాంత వాతావరణంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. రైతుల సమస్యలు తీరే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
