AP Home Minister Vangalapudi Anitha meets Brahmanandam
అకేరు న్యూస్, హన్మకొండ : ప్రముఖ హాస్య నటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. బ్రహ్మానందం కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.హోంమంత్రి వంగలపూడి అనిత తన పిల్లలతో కలిసి బ్రహ్మానందం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించి, వారితో కొంత సమయం పాటు ముచ్చటించారు.
* ఆత్మీయ వాతావరణంలో భేటీ
తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా తన అద్భుతమైన హాస్యంతో కోట్లాది మందిని అలరిస్తున్న లెజెండ్రీ నటుడు బ్రహ్మానందంతో ఈ భేటీ చాలా ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
