Mulugu District Prajavani Program
ఆకేరు న్యూస్,ములుగు : ములుగు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలలో ప్రజావాణి కార్యక్రమాలను ఎంపీడీవోల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలు అధికారులు తీసుకున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఇందులో భాగంగా 10 మండలాలలో 219 మంది అధికారులు హాజరుకాగా 120 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత మండలాల అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ పాల్గొన్నారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి సీతక్క ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారని అధికారులు ప్రజల సమస్యలను తొందరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మార్వో,మున్సిపాలిటీ కమిషనర్,ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ జక్కుల రేవంత్ యాదవ్,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
