Mahesh Babu praised Lokesh Kanagaraj’s DC movie
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తమిళ సినీ పరిశ్రమలో కొత్త తరహా కథనంతో తెరకెక్కిన ‘డీసీ’ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. డైరెక్టర్ కం నటుడు లోకేశ్ కనగరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. 2026 ఆగస్టు 7న విడుదలైన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్లో వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి కీలక పాత్రల్లో కనిపించారు.
* నటీనటుల ఫెర్ఫామెన్స్ మరో లెవల్
ఈ సినిమాపై తాజాగా మహేశ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘డీసీ’లో ప్రతి సీన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సినిమా మేకింగ్, సన్నివేశాల రూపకల్పన, నటీనటుల పెర్ఫార్మెన్స్ తనను ఆకట్టుకున్నాయన్నారు. ప్రత్యేకంగా సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేలా ఉన్నాయన్నారు. లోకేశ్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన ఈ చిత్రం కావడంతో ఆయనను కొత్త కోణంలో చూపించారు. ఇది అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
* రూ.100 కోట్లు
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ₹25 కోట్ల బడ్జెట్తో రూపొంచారు. ఈ సినిమా కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక కనగరాజ్ ఇటు డైరెక్టర్ గా అటు నటుడిగా బిజిబిజీగా మారతాడు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
#DC… what an original and outstanding film 👏🏻👏🏻👏🏻 Just too cool… 😎😎😎 Loved every bit of it!! Congrats to the entire team…🤗🤗❤️❤️@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #WamiqaGabbi @isanjkayy @mukesh_DOP @editor_prasanna @skannanartdir @sunpictures
— Mahesh Babu (@urstrulyMahesh) August 16, 2026

Please tell us what is wrong. Your report will be sent to the website team.
