Ravi Teja’s Comment Sparks Debate, Irumudi event
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
మాస్ మహారాజా రవితేజ చేసిన ఓ వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన తాజా చిత్రం ‘ఇరుముడి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో యువ నటి నక్షత్రను ఉద్దేశించి ఆయన ఉపయోగించిన ఓ పదంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
* ఎలాంటి ముద్దుపేరు పెడతారంటూ..
ఈ కార్యక్రమంలో నక్షత్ర.. తనకు రవితేజ ఎలాంటి ముద్దుపేరు పెడతారంటూ సరదాగా అడిగింది. అందుకు రవితేజ ఓ పదాన్ని రెండుసార్లు పలికారు. దీంతో అక్కడున్న కొందరు నవ్వారు. అయితే ఆ పదానికి అర్థం తనకు తెలియదని నక్షత్ర చెప్పింది. దీనికి రవితేజ తర్వాత చెబుతానంటూ సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో ప్రేక్షకుల్లోనూ నవ్వులు, కేరింతలు వినిపించాయి.
* క్లిప్ వైరల్
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. తెలుగు మాట్లాడే కొన్ని ప్రాంతాల్లో చిన్నపిల్లలను ఆప్యాయంగా పిలిచే సందర్భాల్లో ఈ పదాన్ని ఉపయోగిస్తారని చెబుతున్నప్పటికీ.. మరో సందర్భంలో అది మహిళలను ఉద్దేశించి అభ్యంతరకరమైన అర్థాన్ని కూడా కలిగి ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రవితేజ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం యువ నటిని ఉద్దేశించి అలాంటి పదాన్ని ఉపయోగించడం సరైనది కాదని విమర్శిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
