Jr NTR Pet Dog Bhagira
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క భగీర మృతి చెందింది. భగీరాతో
భగీర ఎన్టీఆర్ కుటుంబంలో ఓ పెంపుడు జంతువుగానే కాకుండా కుటుంబ సభ్యుడిలా కలిసిపోయింది. ఇంట్లో జరిగే పలు సందర్భాల్లో భగీర తో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆప్యాయంగా గడిపేవారు. ఎన్టీఆర్ కూడా భగీరపై ప్రత్యేకమైన ప్రేమను చూపించేవారు. దాంతో భగీర మృతి ఆయనకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
* భావోద్వేగానికి
భగీర మృతితో ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. తనకు ఎంతో దగ్గరైన పెంపుడు జంతువును కోల్పోవడంతో ఆయన అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. భగీరతో కలిసి గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భగీర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు. పెంపుడు జంతువులతో ఏర్పడే అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. వాటిని కోల్పోవడం కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధను కలిగిస్తుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
