MLA Kadiyam Srihari Modi Photo
* వేల కోట్ల ఖర్చు రాష్ట్రానిది
* డిజిటల్ రేషన్ కార్డులపై ఫొటో వివాదం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
వేల కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకంపై ప్రధాని మోడీ ఫోటో ఎలా పెడతారని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా 33 లక్షల 60 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంతర్గత సిసి రోడ్లను ప్రారంభోత్సవం, నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. చిల్పూర్ మండల కేంద్రంలోనే మండల కార్యాలయాల నిర్మాణానికి నెల రోజుల్లో శంకుస్థాపన చేయనున్నట్లు హామీ ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలో 2 కోట్ల 72 లక్షల అభివృద్ధి నిధులు గ్రామానికి మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామంలో సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, 2 వివో భవనాలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. చిల్పూర్ మండల కేంద్రంలో ఆతి త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా మంజూరు కాబోతుందని తెలిపారు. శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధితో పాటు చిల్పూర్ గ్రామంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు ఉన్నాయని అన్నారు. నియోజకవర్గంలో గ్రామ గ్రామాన అభివృద్ధి పనులు చేయడమే నా ప్రధాన లక్ష్యం అని తెలిపారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా సన్న బియ్యం పంపిణి చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పారు. తెలంగాణ చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమం ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల 800 కోట్ల ఖర్చుతో కోటి 6 లక్షల రేషన్ కార్డుల ద్వారా 3 కోట్ల 10 లక్షల మందికి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణి చెస్తున్నట్లు పేర్కొన్నారు.
అత్యున్నత భద్రతా ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులను పంపిణి చేస్తుందని అన్నారు. ఈ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని బీజేపీ వాళ్ళు అంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సన్న బియ్యం పంపిణి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో చేపట్టే కార్యక్రమానికి మోడీ ఫొటో ఎలా పెడతారని ప్రశ్నించారు. పేద ప్రజల కడుపు నింపాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంటే దేశ వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణి చేయాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. పేద ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన నిలబడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అనిత నవీన్, ఎనగందుల నరసింహారెడ్డి లక్ష్మీ ఊమ్లా, మేనక సుధాకర్, రాజు, వెంకటేష్, కర్ణాకర్, నవీన్ మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, మాజీ ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు, తహసీల్దార్ విజయ్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
