CM Revanth USA UK Tour schedule
* ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో భేటీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి గురువారం నుంచి 10 రోజుల విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఆగస్టు 20 నుంచి 30 వరకు యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్ల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై చర్చలు జరపనున్నారు.
* ఆగస్టు 20న లండన్‌కు పయనం
సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 20వ తేదీ అర్ధరాత్రి న్యూఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరనున్నారు. యూకే స్థానిక కాలమానం ప్రకారం ఉదయం లండన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆయన విదేశీ పర్యటన అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
* ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కీలక భేటీ
ఆగస్టు 21న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సీఎం సందర్శించనున్నారు. ప్రభుత్వ పాలన, విద్య, విధాన రూపకల్పన వంటి అంశాలపై అక్కడి ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. అదే రోజు సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే EPL ఫుట్‌బాల్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
* కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం
ఆగస్టు 22న కేంబ్రిడ్జ్ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌ను, సాయంత్రం లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శించనున్నారు. తెలంగాణలో ఉన్నత విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయ సంస్థల సహకారంపై ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి.
* ఆగస్టు 23న అమెరికాకు..
యూకే పర్యటన ముగించుకుని ఆగస్టు 23న సీఎం రేవంత్‌రెడ్డి లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్‌కు బయలుదేరనున్నారు. అమెరికా పర్యటనలోనూ పలు ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
* హార్వర్డ్.. MITలో కీలక కార్యక్రమాలు
ఆగస్టు 24న బోస్టన్లోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సీఎం సందర్శించనున్నారు. అనంతరం MIT క్యాంపస్‌కు వెళ్లనున్నారు. విద్య, పరిశోధన, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి సంస్థలతో భాగస్వామ్యాల అవకాశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అదే రోజు రాత్రి బోస్టన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరుతారు.
* నార్త్ఈస్టర్న్, వర్జీనియా టెక్ ప్రతినిధులతో భేటీలు
ఆగస్టు 25న నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సీఎం సందర్శించనున్నారు. అనంతరం వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందంతో సమావేశం కానున్నారు. తెలంగాణలో విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థల మధ్య అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
* న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులతో సమావేశం
ఆగస్టు 26న న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (USA) ఆధ్వర్యంలో నిర్వహించే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు, వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
* ఆగస్టు 30న హైదరాబాద్‌కు తిరుగు
అమెరికా పర్యటనను ముగించుకుని ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి తిరుగు ప్రయాణం ప్రారంభించనున్నారు. ఆగస్టు 30న ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. మొత్తం పర్యటనలో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్లు, ప్రతినిధి బృందాలతో జరిగే సమావేశాలు తెలంగాణలో విద్య, పరిశోధన, పరిశ్రమలు, పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సూచిస్తున్నాయి.
* ప్రధాన ఉద్దేశం ఇదే..
ప్రపంచస్థాయి విద్యా సంస్థల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, పరిశోధన–నైపుణ్యాభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసి తెలంగాణలో వాటిని అనుసంధానించే అవకాశాలను పరిశీలించడం ఈ పర్యటనలో కీలక అంశంగా కనిపిస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ సంస్థలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు, పెట్టుబడుల అవకాశాలను బలోపేతం చేయడంపైనా ప్రభుత్వం దృష్టి సారించనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
